అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే కూటమి ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగుతోంది. ప్రతి విషయంపై కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. సీఎం చంద్రబాబు రూట్ కూడా ప్రస్తుతం ఆ దిశగానే ఉంది. తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడానికి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం చంద్రబాబు(Chandrababu). ఈ క్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, సిబ్బంది చేసే ప్రతి తప్పును ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ వాటిని పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మంత్రులు, సిబ్బందికి సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. వాటితో పాటే స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు.
‘‘ఆంధ్రలో ప్రభుత్వం మారి రెండు నెలలవుతోంది. ఇప్పటికే కొంత మంది మంత్రుల పేషీల్లో నియామకలు పూర్తికాక. మరికొందరి పేషీల్లో ఇంకా నియామకాలు జరుగుతున్నాయి. ఎన్నో అంచనాలతో ప్రజలకు మనకు పట్టం కట్టారు. దీంతో అందరి కళ్లు కూటమి ప్రభుత్వంపైనే ఉన్నాయి. ఏ చిన్న తప్పు జరిగిన ఎత్తిచూపడానికి కొందరు కాచుకుకూర్చున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయండి’’ అని సూచించారు. అదే విధంగా ఎంత చెప్తున్నా కొందరి పద్దతి మారడం లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. ‘‘కొందరిలో మార్పు శూన్యంగా ఉంది. ఆయన అలాగే చెబుతుంటారులే.. మన పని మనం చేసుకుందాం. ఏదో రకంగా దండుకుందాం అనుకునే బాపతి పెరుగిపోతోంది. ఏపీ సెక్రటేరియట్(AP Secretariat)లో తిష్ట వేసిన చేయిచాపుడు బ్యాచ్ అంతా కూడా ఈ రెండు నెలలు కాస్త సయమనం పాటించిన మళ్ళీ విజృంభిస్తోంది. లంచం నేరుగానే అడిగేస్తున్నారనే ఆరోపణలు పెరుగుతున్నాయి. కొందరు ఏకంగా మంత్రుల పేర్లే చెప్తున్నారు. కాబట్టి ఎవరూ ఇలాంటి ప్రోత్సహించొద్దు. చేసినట్లు తెలిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని Chandrababu స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.