సీఎం నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) ఈరోజు విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన ఇందిరాగాంధీ స్టేడియం చేరుకున్నారు. ఆయనకు పోలీసులు గౌరవ వందనంతో ఆహ్వానం పలికారు. అనంతరం ఆయన జెండాకు ఆవిష్కరించారు. ఈరోజున స్వరాజ్యం కోసం వీరులు చేసిన త్యాగాలను, వారి తెగువను గుర్తు చేసుకోవాలని, వారికి నివాళిగా ప్రతి ఒక్కరూ జెండా వందనం చేయాలని కోరారు. నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి చంద్రబాబు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan).. శ్రీహరి కోట సందర్శన అనంతరం నేరుగా కాకినాడ చేరుకున్నారు. అక్కడే ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అదే విధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) కూడా గుంటూరు జిల్లాలో జెండాను ఆవిష్కరించారు.