ఎన్నికలపై సీఎం జగన్(CM Jagan) కీలక వ్యాఖ్యలు చేశారు. గతంతో పోలిస్తే ఈసారి 20 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందని తెలిపారు. తెలంగాణలోనూ ముందుగానే ఎన్నికలు జరిగాయని.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ముందుకు రావాలని అనుకుంటోందన్న సంకేతాలు వస్తున్నాయన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని.. క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా పని చేయాలని మంత్రులకు సూచించారు. విపక్షాలు చేసే తప్పుడు ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అలాగే ఎన్నికలకు వైసీపీ పూర్తి సన్నద్ధంగా ఉందని జగన్ స్పష్టంచేశారు.
తాడేపల్లి(Thadepalli) క్యాంపు కార్యాలయంలో జగన్(CM Jagan) అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ఆరోగ్య శ్రీ కింద చికిత్స పరిమితి రూ.25లక్షలకు పెంపు.. జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక జనవరి నుంచి పెన్షన్లను రూ.2,750 నుంచి రూ.3వేలకు పెంపు.. వైఎస్ఆర్ ఆసరా, చేయూత పథకాల అమలుకు ఆమోదం తెలిపారు. విశాఖ లైట్ మెట్రో ప్రాజెక్ట్ DPR.. వైజాగ్‌లోని 4 కారిడార్లలో మెట్రో నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది.