CM Jagan Disburse Interest free loan to Small Vendors Under Jagananna Thodu Scheme: disburse in AP: ఏపీ ప్రభుత్వం చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.10 వేలు జమ చేసింది. వ్యాపారులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో జగన్ సర్కార్ జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించింది. నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారికి అండగా ఉంటూ, వారి ఉపాధికి ఊతమిచ్చేలా వడ్డీ లేని రుణం అందించడమే ఈ పథకం లక్ష్యం. అందులో భాగంగా అర్హులైన ఒక్కొక్కరికి ఏటా రూ. 10,000 చొప్పున వడ్డీలేని రుణం అందించనుంది ఏపీ ప్రభుత్వం. 3.95 లక్షల మంది చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారికి బ్యాంకుల ద్వారా కొత్తగా రూ.395 కోట్ల వడ్డీలేని రుణాలు నేడే బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. నేడు అందిస్తున్న రూ. 395 కోట్ల రుణంతో కలిపి ఇప్పటివరకు 15,31,347 మంది చిరు వ్యాపారులకు రూ. 2,406 కోట్లు అందిచారు.
జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. వారందరి ఖాతాల్లోకి రూ.10 వేలు జమ
-