ఏపీలో ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్(CM Jagan) మళ్లీ క్లారిటీ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు స్పష్టం చేశారు. ముందస్తుకు(Early Elections) వెళ్తున్నామంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. ఎన్నికలకు ఇంకా 9 నెలలే సమయం ఉందని.. కొంచెం కష్టపడితే గెలుపు మళ్లీ మనదే అని పేర్కొన్నారు. అందుకోసం నేతలంతా ప్రజల్లోనే ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలని తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు జగన్ వ్యాఖ్యానించారు. అలాగే కేబినెట్ మీటింగ్‌లో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. కాగా ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని విపక్షాలు చెబుతున్న నేపథ్యంలో సీఎం జగన్(CM Jagan) మరోసారి ముందస్తుపై స్పష్టమైన ప్రకటన చేశారు.
ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్ ఫుల్ క్లారిటీ
-