Vishnuvardhan Reddy | సీఎం జగన్ ప్రజాసంపదను కొల్లగొడుతున్నారు: విష్ణువర్ధన్ రెడ్డి

-

వైసీపీ ప్రభుత్వం ప్రజల సంపదను కొల్లగొడుతుందని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి(Vishnuvardhan Reddy) మండిపడ్డారు. ప్రకృతి వనరులను కూడా దోచేస్తూ.. కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక, కంకర, గ్రానైట్, ఇతర ముడి సరుకు వసూళ్లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని ఆరోపించారు. చిత్తూరు, కడప, విజయనగరం, అనంతపురంలలో విచ్చలవిడిగా దోపిడికి పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. దొంగ చేతికి తాళం ఇస్తే ఎలా ఉంటుందో జగన్ చేతికి ప్రభుత్వం అప్పగించడం కూడా అలాగే ఉందని విమర్శించారు. బీజేపీ తొమ్మిదేళ్ల పాలన సందర్భంగా బహిరంగ సభలు జరుగుతున్నాయని తెలిపారు. రేపు అనంతపురంలో కిరణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy), రాజమండ్రిలో సోము వీర్రాజు(Somu Veerraju), అరకులో దగ్గుబాటి పురంధరేశ్వరి(Purandeswari) ఈ సభల్లో పాల్గొంటారని విష్ణువర్ధన్(Vishnuvardhan Reddy) వెల్లడించారు.

- Advertisement -
Read Also:
1.  వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
2. కొండెక్కిన చికెన్ ధర.. కేజీ రూ.350

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Salman Khan | ‘నేను అదో గొప్ప అనుకునేవాడిని’.. యాటిట్యూడ్‌పై సల్మాన్ క్లాస్

బిగ్‌బాస్ 18వ సీజన్‌ను హోస్ట్ చేస్తున్న సల్మాన్ ఖాన్(Salman Khan).. తాజా...

Ravanth Reddy | ‘ఢిల్లీకి ఎన్ని సార్లైనా వెళ్తా.. ఈరోజు అందుకే వెళ్తున్నా’

తన ఢిల్లీ పర్యటనలపై రాష్ట్రంలో జరుగుతున్న చర్చలపై సీఎం రేవంత్ రెడ్డి(Ravanth...