CM Jagan Mohan Reddy :వైసీపీకి ప్రజలతోనే పొత్తు : సీఎం జగన్‌

-

CM Jagan Mohan Reddy disbursing jagananna vidya deevena funds in madanapalle: పొత్తులపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు ఎవరితోనూ పొత్తులు ఉండవనీ.. ప్రజలతోనే తమకు పొత్తు ఉంటుందని జగన్‌ స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జగనన్న విద్యా దీవెన నాలుగో విడత కింద తల్లుల ఖాతాల్లోకి రూ. 694 కోట్ల నగదును సీఎం జగన్‌ బటన్‌ నొక్కటం ద్వారా జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రతిపక్షాల నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పేదరికం వల్ల ఏ ఒక్కరూ చదువుకు దూరం కాకూడదనే వైయస్‌ఆర్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అమలు చేస్తున్న సీఎం జగన్‌ వివరించారు. కానీ టీడీపీ హాయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని నీరుగార్చారని మండిపడ్డారు.

- Advertisement -

టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు పెట్టిన బకాయిలు సైతం తాము చెల్లించినట్లు వివరించారు. రైతులను మోసం చేసిన బాబు ఇప్పుడు వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎస్టీ, ఎస్సీ, బీసీలకు అన్యాయం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. పిల్లలను మోసం చేసిన బాబు.. చదువులు గురించి మాట్లాడటం ఏంటని జగన్‌ ధ్వజమెత్తారు. రాక్షసులు, మారీచులతో తాము యుద్ధం చేస్తున్నామనీ.. బటన్‌ నొక్కితే పుట్టగతులు ఉండవనే ఉద్దేశంలో దుష్టచదుష్టయం దుష్ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. వాళ్లు రాష్ట్రాన్ని పాలించేటప్పుడు దోచుకో, పంచుకో, తినుకో అనే డీపీటీ సిద్ధాంతాన్ని అమలు చేశారంటూ దుయ్యబట్టారు.

పేదల పిల్లలు ఇంగ్లీష్‌లో చదవకూడదని వాదించే వారి మనసులు మారాలని జగన్‌ అన్నారు. విద్యను, మహిళలను దగా చేసిన చంద్రబాబు తిరిగి వాళ్ల గురించే మాట్లాడటం హస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు లెక్చర్‌ ఇస్తుంటే.. ప్రజలు ఇదేం ఖర్మరా బాబు అని అంటున్నారని విమర్శించారు. దత్తపుత్రుడు, ప్రతిపక్ష మీడియా ఛానెళ్లు చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని జగన్‌ సూచించారు. తాను దత్తపుత్రుడిని, మీడియాను కాకుండా.. దేవుడిని, ప్రజలను నమ్ముకున్నానని జగన్‌ స్పష్టం చేశారు. తనకు నీతి, నిజాయితీ ఉన్నాయనీ, అందుకే ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతున్నానని జగన్‌ (CM Jagan Mohan Reddy ) అన్నారు.

గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేనిఫెస్టోని చెత్తబుట్టల్లో వేసేవారనీ.. రాజకీయాల్లో ప్రస్తుతం జవాబుదారీతనం తీసుకువచ్చింది మాత్రం తామేనని జగన్‌ పేర్కొన్నారు. మంచి జరిగిందని అనుకుంటే.. తనకు అండగా నిలవాలని ప్రజలకు సూచించారు. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, పవన్‌ కల్యాణ్‌ గజదొంగలని జగన్‌ వ్యాఖ్యానించారు. విద్యార్థుల కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా.. భవిష్యత్తు ఆస్తిగా భావిస్తున్నట్లు జగన్‌ తెలిపారు. విద్యార్థులు చదువుకుంటేనే తలరాతలు మారుతాయి ఉద్ఘాటించారు. మీ పిల్లల చదువుకు నేను అండగా ఉంటానని జగన్‌ హామీ ఇచ్చారు.

నాడు-నేడు పథకం ద్వారా విద్యాశాఖ రూపురేఖలు మారనున్నాయని తెలిపారు. ప్రైవేటు, కార్పొరేట్ల పాఠశాలలను తలదన్నేలా సర్కారు బడులను చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పోటీలో వెనకబడకూడదనే సీబీఎస్‌ సిలబస్‌ను ప్రవేశపెట్టినట్లు జగన్‌ వివరించారు. కానీ తాను బటన్‌ నొక్కి మంచి పనులు చేస్తుంటే.. ప్రతిపక్ష నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బటన్‌ నొక్కితే ఏపీ మరో శ్రీలంక అవుతుందంటూ ప్రతిపక్షాలు దుష్ప్రచారాలు చేస్తూ, పథకాలు ఆపేందుకు కుట్ర చేస్తున్నాయని దుయ్యబట్టారు. సర్కాలు బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నిస్తే.. ప్రతిపక్షాలు మోకాలొడ్డుతున్నాయని సీఎం జగన్‌ మండిపడ్డారు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...