YSR తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కానుంది. జనవరి 4న ఢిల్లీలో AICC పెద్దల సమక్షంలో షర్మిల(YS Sharmila) హస్తం కండువా కప్పుకోనున్నారు. తాను ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టనున్నట్లు పార్టీ నేతల సమావేశంలో స్వయంగా వెల్లడించారు. అంతేకాదు తనతో పాటు మరో 40 మంది కాంగ్రెస్ లో చేరనున్నట్టు ఆమె వెల్లడించారు. వీరిలో వైసీపీలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు, అసంతృప్తులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జగన్ పై కుట్రలో భాగంగానే షర్మిలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఏపీ సీఎం జగన్(CM Jagan), షర్మిల అన్న వైఎస్ జగన్ పరోక్షంగా స్పందించారు.
బుధవారం కాకినాడ(Kakinada)లో పెన్షన్ల పెంపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. “రాబోయే రోజుల్లో కుట్రలు, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి. కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు, మోసాలు చేస్తారు, అప్రమత్తంగా ఉండాలి అని మిమ్మల్ని కోరుతున్నా” అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు జగన్. అయితే కుటుంబాలను చీలుస్తారని జగన్(CM Jagan) చేసిన వ్యాఖ్యలు షర్మిలని ఉద్దేశించే అని విశ్లేషకులు భావిస్తున్నారు.
రాబోయే రోజుల్లో కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారు..
మీ బిడ్డ నమ్ముకుంది మిమ్మల్ని.. పైన దేవుడిని మాత్రమే..#CMYSJagan#AndhraPradesh pic.twitter.com/VjrwT6rlhl
— YSR Congress Party (@YSRCParty) January 3, 2024