CM Jagan Release YSR Pension Kanuka Funds in Rajahmundry: ఏపీలో వృద్ధులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. పింఛన్ లబ్ధిదారులతో మంగళవారం రాజమండ్రిలో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. రూ.1,765 కోట్ల నిధులను విడుదల చేస్తూ కొత్తగా 2,31,989 మందికి పెన్షన్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. పించన్లు పెంచుతామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లు తెలిపారు. పించన్లు కేవలం వృద్ధులకే కాకుండా రకరకాల వ్యాధులతో బాధపడుతున్న అర్హులందరికీ అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ అందేది. మన ప్రభుత్వంలో 64 లక్షలమందికి అందిస్తున్నామని తెలిపారు. పెన్షన్ ను రూ.2,500 నుంచి రూ.2,750కు పెంచామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. 2,750 నుంచి రూ. 10 వేల వరకు పెన్షన్లు ఇస్తున్నామని ఏపీ సీఎం జగన్ వెల్లడించారు.
జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ పథకానికి భారీగా నిధుల విడుదల
-