దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YSR) జయంతి సందర్భంగా రాష్ట్ర రైతులకు సీఎం వైఎస్ జగన్(CM Jagan) మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. 2022 ఖరీఫ్ బీమా పరిహారం రూ.1,117 కోట్లు పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 10.2లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. 2022 ఖరీఫ్ సీజన్‌లో పంట నష్టపోయిన రైతులకు సీఎం జగన్(CM Jagan) ఖరీఫ్-2022 బీమా పరిహారం పంపిణీ చేయనున్నారు. అనంతపురం జిల్లాలో వైఎస్‌ఆర్ రైతు దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అక్కడ్నుంచి ఇడుపులపాయకు చేరుకుంటారు. ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ దగ్గర నివాళులర్పించనున్నారు. రేపు పులివెందులలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్(Skill Development Centre) సహా పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నెల10న కొప్పర్తి పారిశ్రామికవాడలో ఆల్‌డిక్సన్ యూనిట్‌కు ప్రారంభోత్సవం చేయనున్నారు. పారిశ్రామిక యూనిట్లకు శంకుస్థాపన చేస్తారు.
Read Also: బట్టలు లేకుండా వీడియోలు.. రివర్స్ అయిన యువకుడి లైఫ్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat