CM Jagan: ప్రతిపక్షాలు చెప్పే అబద్ధాలు నమ్మొద్దు: సీఎం జగన్‌

-

CMJagan satrts second phase of Jagananna Bhu hakku- Bhu raksha survey at Narasannapeta: ఎటువంటి వివాదాలకు తావు లేకుండా రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతో భూముల సర్వే జరుగుతోందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో “జగనన్న భూహక్కు-భూరక్ష” పథకం రెండో దశను ప్రారంభించిన జగన్‌, అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. మహాయజ్ఞంలా భూరికార్డుల ప్రక్షాళన జరుగుతుందని సీఎం అన్నారు.

- Advertisement -

రాష్ట్రంలోని భూములన్నీ కొలతలు వేసే కార్యక్రమమిది అని అన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని జగన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మెుదటి దశలోని రెండు వేల గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాలు అందజేస్తామని తెలిపారు. రెండో దశ 2023 ఫిబ్రవరి నాటికి మరో 4వేల గ్రామాల్లో, మూడో దశలో 2023 మే నాటికి 6వేల గ్రామాల్లో, నాలుగో దశలో ఆగస్టు నాటికి 9వేల గ్రామాల్లో భూహక్కు పత్రాలు అందజేస్తామని సీఎం ప్రకటించారు. ప్రతి కమతానికి ఐడెంటిఫికేషన్‌ నెంబర్‌ ఇవ్వటంతో.. అన్ని రికార్డులు ప్రక్షాళన అవుతున్నాయన్నారు. దీని వల్ల భూములు ఆక్రమించుకుంటారన్న భయం తొలగిపోతుందన్నారు.

ప్రతి ఇంటికీ మంచి జరిగిందా లేదా అనేదే కొలమానంగా పెట్టుకోవాలనీ.. ప్రతిపక్షాలు చెప్పే అబద్ధాలు నమ్మొద్దుని సీఎం జగన్‌ ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీ పెట్టి సొంతంగా అధికారంలోకి వస్తే ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌, వైయస్‌ జగన్‌ అంటారు.. పిల్లను ఇచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి కుర్చీ లాక్కునేవారిని చంద్రబాబు అంటారని ఎద్దేవా చేశారు. లాస్ట్‌ ఛాన్స్‌ అంటూ వస్తున్నవారికి మరొక ఛాన్స్‌ ఇవ్వొదని ప్రజలకు సూచించారు.

తమ ఆస్తిని అనుభవించేవారిని హక్కుదారుడు అంటారు.. పరాయి వారి ఆస్తిని కాజేసేవారిని కబ్జాదారుడు అని అంటారని వ్యాఖ్యానించారు. రావణుడిని సమర్థించేవారిని రాక్షసులం అంటామని జగన్‌ ఘాటుగా అన్నారు. వెన్నుపోటు పొడిచిన నాయకుడిని అసెంబ్లీకి పంపాలా.. మీ సేవలు వద్దు బైబై బాబు అని ఇంటికి పంపాలా వద్దా ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసిన బాబుని అసెంబ్లీకు పంపాలా.. మీ సేవలు వద్దని ఇంటికి పంపాలా అని ప్రజలు ఆలోచించాలని సీఎం జగన్‌ (CMJagan)  సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...