Nellimarla | ఈవీఎంలో అవకతవకలు జరిగాయంటూ మాజీ ఎంపీ బెల్లాన, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే అప్పల నరసయ్య ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఈవీఎంలను తనిఖీ చేయడానికి కలెక్టర్, ఫిర్యాదు దారులు వెళ్లారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఈవీఎం గోదాముకు కలెక్టర్ చేరుకున్నారు. కాగా తలుపుతు తెరవడానికి సిబ్బంది తర్జనబర్జన పడ్డారు. ఇంతలో తాళాలు మిస్సింగ్ అని తెలియడంతో వారిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Nellimarla | తలుపులు తెరవడానికి ఆలస్యం ఎందుకని కలెక్టర్ అడిగితే తాళాలు ఆర్డీఓ దగ్గర ఉన్నాయంటూ అధికారులు కుంటిసాకులు చెప్పడంతో కలెక్టర్ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదు దారులు సందేహపడాల్సిన అవసరం లేదని, అవసరమైతే తలుపులు బద్దలు కొట్టైనా ఈవీఎంలను చూపుతామని అధికారులు ఫిర్యాదుదారులకు సమాదుయించారు. కాగా తాళాలు లభించకపోతే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ వెల్లడించారు.