Tulasi Reddy :రాయలసీమకు జగన్ ద్రోహం

-

సీఎం జగన్(CM Jagan)రాయలసీమకు ద్రోహం చేస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి (Tulasi Reddy) మండిపడ్డారు. సీఎం తొమ్మిది ప్రధానమైన అంశాలలో తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. విభజన చట్టం ప్రకారం కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలి.. కానీ పెట్టలేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర సచివాలయాన్ని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తే ఎక్కువ నష్టపోయేది రాయలసీమ ప్రజలేనని, శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని అయినప్పటికి ఇప్పటి వరకు హైకోర్టు బెంచ్ కూడా లేదన్నారు. కడప,బెంగళూరు రైలు మార్గం రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వని కారణంగా పనులు నిలిచి పోయాయి అని వివరించారు. మరోవైపు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో కాకుండా విశాఖలో పెట్టమని ప్రభుత్వం లేఖ రాయడం రాయలసీమకు ద్రోహం చేయడమేనని అన్నారు. వ్యవసాయ పంపు సీట్లకు మీటర్లు బిగిస్తే ఎక్కువ నష్టపోయేది రాయలసీమ వాసులేనని, రాయలసీమకు జగన్ చేసిన ద్రోహాన్ని ఈ ప్రాంత ప్రజలు గుర్తుంచుకుని వచ్చే ఎన్నికల్లో వైసీపీ(YCP) ఇతర పార్టీలను ఓడించి కాంగ్రెస్ (CONGRESS)  పార్టీకి పట్టం కట్టాలని కోరారు.

- Advertisement -

Read also:తెలుగు ప్రజలను అలరించేందుకు వస్తున్న కాంతారా

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Banana | రోజుకో అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా..!

అరటి పండు(Banana) తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జగమెరిగిన...

Salman Khan | ‘నేను అదో గొప్ప అనుకునేవాడిని’.. యాటిట్యూడ్‌పై సల్మాన్ క్లాస్

బిగ్‌బాస్ 18వ సీజన్‌ను హోస్ట్ చేస్తున్న సల్మాన్ ఖాన్(Salman Khan).. తాజా...