మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై వీహెచ్ సెన్సేషనల్ కామెంట్స్

-

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy) కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు. శుక్రవారం ఢిల్లీలో జేపీ నడ్డా(JP Nadda) సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. ఆయన కమలదళంలో చేరడంపై కాంగ్రెస్ శ్రేణుల నుండి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు(V Hanumantha Rao) కిరణ్ కుమార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పార్టీ బీజేపీ లో చేరడం దుర్మార్గమని మండిపడ్డారు.

- Advertisement -

కనీసం మంత్రి కూడా చేయకుండా కిరణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy) కి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గా అవకాశం ఇచ్చింది. సోనియమ్మ కు ఆరోగ్యం బాగా లేకున్నా పార్టీ నడిపిస్తున్నారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి పార్టీకి మంచి ఊపు తెస్తున్నారు. ఇలాంటి తరుణంలో పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కిరణ్ అని ఘాటు విమర్శలు చేశారు వీహెచ్. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి బద్ధ శత్రువుగా ఉన్న పార్టీ లో చేరడం దుర్మార్గమైన చర్య అని వీహెచ్ దుయ్యబట్టారు.

కిరణ్ బాగా సంపాదించాడని వార్తలు ఉన్నాయి. బీజేపీలో చేరితే అవన్నీ సమసిపోతాయని చేరివుంటాడని వీహెచ్ ఆరోపించారు. కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ కూడా నమ్మవద్దు అంటూ హితవు పలికారు. ఇలాంటి వ్యక్తికి సరైన సమయంలో బుద్ధి చెప్పాలి. కార్యకర్తలు బాగా కష్టపడి పార్టీని నిలబెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ కు మంచి భవిష్యత్తు ఉంది. కార్యకర్తలు మనోధైర్యం తో ఉండాలంటూ వీహెచ్ సూచించారు.

Read Also: మా ముఖ్యమంత్రి చాలా సింపుల్‌గా ఉంటారు: మంత్రి తలసాని

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...