MP GVL Says Congress Used Gandhi’s Name for political Gain గాంధీ పేరును ఓ కుటుంబం రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారని కాంగ్రెస్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్ పరోక్ష ఆరోపణలు చేశారు. గాంధీ జయంతి సందర్భంగా విశాఖపట్నంలో మీడియాతో జీవీఎల్ మాట్లాడారు. గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి, భగత్ సింగ్ వంటి మహానీయులను మోదీ సర్కారు ఘనంగా గౌరవిస్తోందన్నారు. గాంధీని ఆదర్శంగా తీసుకొని, మోదీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. మహాత్మ గాంధీకు ఖాదీ అంటే ఎంతో ఇష్టమని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. త్యాగాలు చేసిన వారిని కూడా గుర్తు పెట్టుకోవాలని.. అన్నింటికీ మీ పేర్లు పెట్టుకోవద్దని సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
MP GVL: గాంధీ పేరును రాజకీయ లబ్ధికి వాడుకున్నారు
-