CPI Narayana: ఏపీలో బీజేపీ, వైసీపీ కలిసే పనిచేస్తున్నాయి

-

CPI Narayana fires on Bjp and YSRCP and AP CM Ys jagan: మూడున్నర ఏళ్లలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ, వైసీపీ కలిసే పనిచేస్తున్నాయనీ.. అందుకే బీజేపీని విమర్శించే సాహసం సీఎం జగన్‌ చేయటం లేదని ధ్వజమెత్తారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన నారాయణ, పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ తరువతా పవన్‌ ఎందుకో సైలెంట్‌ అయ్యారని అనుమానం వ్యక్తం చేశారు. ఇష్టం ఉన్నా, లేకపోయినా, టీడీపీ, జనసేన, వాపక్షాలు కలిసి ముందుకు వెళ్లాలని నారాయణ సూచించారు.

- Advertisement -

ఇరవై సంవత్సరాలుగా మహిళా బిల్లు పెండింగ్‌లో ఉందనీ, బీజేపీకి పూర్తి మెజారిటీ ఉన్న కారణంగా, ఇప్పటికైనా ఆ బిల్లును ఆమోదించాలని నారాయణ (CPI Narayana) డిమాండ్‌ చేశారు. జీ 20 సమావేశాలకు నాయకత్వం వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, బిల్లును ఆమోదిస్తే.. మనకు గౌరవం దక్కుతుందనీ.. జీ 20 సమావేశాలకు ముందే ఆ బిల్లును ఆమోదించాలని అన్నారు. సీబీఐ, ఈడీలను నరేంద్రమోదీ ప్రభుత్వం ఇతర పార్టీ నేతలపై ఒత్తడి తెచ్చేందుకు ఉపయోగిస్తుందని ఆరోపించారు. రాజకీయ కోణంలోనే తెలంగాణలోని టీఆర్‌ఎస్‌ నేతల లక్ష్యంగా దాడులు చేస్తున్నట్లు విమర్శులు గుప్పించారు. సుప్రీం కోర్టు ఈ ఘటనను సుమోటోగా తీసుకోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...