అమరావతి నిర్మాణాన్ని ఆంద్రప్రదేశ్‌లో ఏర్పడిన కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఎలాగైనా అమరావతి(Amaravati)ని ఈ ఐదేళ్లలో పూర్తి చేయాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ అండ్ క్యాపిటల్ ఏరియా(సీఆర్‌డీఏ అండ్ సీఏ)తో కలిసి పనుల వేగాన్ని కూడా వేగవంతం చేస్తోంది. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చి దిద్దాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది రాష్ట్ర సర్కార్.
Amaravati | ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారులతో అనుసంధానం చేసేలా సీఆర్‌డీఏ సరికొత్త ప్రణాళిక రూపొందిస్తోంది. సీడ్ యాక్సిస్ రోడ్ తరహాలో మరో రెండు రోడ్లను అభివృద్ధి చేయాలని కూడా భావిస్తోంది సీఆర్‌డీఏ. చెన్నై-కోల్కతా ఎన్‌హెచ్‌కు ఈ-11, 12 రోడ్లు అనుసంధానం చేయాలని, కొండ అంచునుంచి రోడ్లు నిర్మించాలని సీఆర్‌డీఏ కసరత్తులు చేస్తోంది. వీటి ప్రణాళిక సిద్ధమై ఆమోదం పొందిన వెంటనే పనులు ప్రారంభించాలని కూడా సీఆర్‌డీఏ యోచిస్తోంది.