ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ ప్రథమ వార్షికోత్సవంలో మాజీ మంత్రి, టీడీపీ సీనయర్ నేత దేవినేని ఉమా(Devineni Uma) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనపార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి అభినందనలు తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పై పలు విమర్శలు చేశారు. పేదల ఆకలి తీర్చేందుకు టిడిపి హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వం మూసేసిందని ఆగ్రహించారు. టిడిపి అధికారంలోకి వచ్చాక తిరిగి అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని అన్నారు.
దేవినేని ఉమా(Devineni Uma) కామెంట్స్:
మైలవరం అన్న క్యాంటీన్ సంవత్సరకాలం పూర్తి చేసుకుని దాతల సహకారంతో దిగ్విజయంగా కొనసాగుతుంది.
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 36 లక్షలతో భవన నిర్మాణం ప్రారంభం చేసి పేదలకు పట్టెడన్నం పెట్టానన్న లక్ష్యంతో ముందుకు సాగితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాన్ని నాశనం చేసింది.
ఈ పవిత్రమైన స్థలాన్ని అపవిత్రం చేసి పాడుబెట్టింది.
మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ భవన నిర్మాణం పూర్తి చేసి అధికారికంగా మైలవరం పట్టణానికి శాశ్వతంగా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తాం.
మైలవరంలో గత 365 రోజులుగా అన్న క్యాంటీన్ నడుస్తుంది, లక్ష మంది అన్న క్యాంటీన్లో భోజనం చేశారు.
దాతల సహకారంతో ఈ అన్న క్యాంటీన్ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకుంది.
మైలవరం పట్టణంలో ఉన్న ఎందరో పేదలకు ఆకలి తీర్చుతుంది, మైలవరం పట్టణానికి వివిధ పనుల మీద వచ్చినవారి ఆకలి తీర్చడం జరుగుతుంది.
ఎన్నో అడ్డంకులు సృష్టించినా కార్యకర్తలు, నాయకుల సహకారంతో పేదల ఆకలి తీర్చడం జరుగుతుంది.
ఇప్పటికీ చాలామంది దాతలు, కార్యకర్తలు గొప్ప మనస్సుతో విరాళాలు ఇచ్చారు, కొందరు కావాల్సిన సరుకులు ఇవ్వడం జరిగింది.
నాడు ఎన్టీఆర్ గారు రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చారు అదే స్పూర్తితో చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ ప్రారంభం చేశారు.