Dharmana: విశాఖ రాజధానిగా వద్దని చెప్పినా ఎవరైనా ద్రోహులేనని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే టీడీపీకి అభ్యంతరమేంటి? ప్రశ్నించారు. రాష్ట్ర విభజన చట్టం చేసినప్పుడు ఏపీకి అన్యాయం చేశారన్నారు. గడిచిన 75 ఏళ్లలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసి ఉంటే.. విభజన ఉద్యమం వచ్చేదికాదని, నష్టం ఉండేది కాదని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఆశపడి చంద్రబాబు రాష్ట్రం పై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. విశాఖపట్నంలో ధనవంతుల జాబితా తీస్తే 100 మందిలో 99 మంది ఇతర ప్రాంతాల వారే ఉంటారని అన్నారు. ఉత్తరాంధ్రకు రాజ్యాంగబద్ధంగా ఆస్తులు, సంపదలు చేజారాయని… 23 కేంద్ర సంస్థలలో ఒక్కటి కూడా ఉత్తరాంధ్రలో పెట్టలేకపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ధ్యేయంగా జగన్ ఆలోచన చేస్తున్నారని కొనియాడారు.
Read also: Pothina Mahesh :అందులో వైసీపీ నేతలు దిట్ట