దివ్వల మాధురి ఆత్మహత్యాయత్నం.. వాణినే కారణం..

-

దువ్వాడ శ్రీనివాస్(Duvvada Srinivas), దివ్వల మాధురి(Divvala Madhuri).. కొన్ని రోజులుగా వీరు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి రచ్చ తీవ్రంగా ఉంది. ఈ విషయంలో ఊహించని మలుపు తిరిగింది. దివ్వల మాధురి నడుపుకుంటూ వెళ్తున్న కారుకు ప్రమాదం జరిగింది. పలాస మండలం లక్ష్మీపురం టోల్‌గేట్ దగ్గర ఆగి ఉన్న కారును ఢీకొట్టిన మాధురి కారు బోల్సా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికు సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను హుటాహుటిన పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందడానికి ఆమె నిరాకరించారు.

- Advertisement -

‘‘నాకు జరిగింది ప్రమాదం కాదు. నేను కావాలనే కారును ఢీకొట్టాను. ఆత్మహత్య చేసుకోవాలనే టెక్కలి నుంచి వచ్చాను. నాపైన, నా పిల్లలపైన దువ్వాడ వాణి చేసిన ఆరోపణలు తీసుకోలేకపోతున్నాను. నన్ను అన్నా పర్లేదు.. నా పిల్లలు చాలా చిన్నవాళ్లు వాళ్లని అనడం నేను తట్టుకోలేకున్నాను. అందుకే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని వచ్చాను. కానీ నన్ను చావనివ్వకుండా దేవుడు కూడా మోసం చేశాడు. నాకు వైద్యం కూడా వద్దు. నన్ను ఇంతే చచ్చిపోనివ్వండి’’ అంటూ ఆమె(Divvala Madhuri) ఆసుపత్రిలో వ్యాఖ్యానించారు.

Read Also: ఏపీలో ఐఏఎస్ అధికారులను బదిలీ
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...