సూర్యగ్రహణం కారణంగా విజయవాడలోని దుర్గమ్మ ఆలయాన్ని ఈనెల 25న మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. సూర్యగ్రహణం సందర్భంగా 25న ఉదయం 10 గంటలకు అమ్మవారికి మహానివేదన, పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ ద్వారాన్ని మూసివేయనున్నట్లు వివరించారు. భక్తులు ఈ విషయాన్ని గ్రహించి, ఆలయ అధికారులకు సహకరించాలనీ కోరారు. కాగా, విజయవాడ దుర్గమ్మ ఆలయంలో అంతరాయ దర్శనం సామాన్యులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు వీఐపీలకు మాత్రమే అవకాశం ఉండేదనీ.. ఇకపై సామాన్యులకు అవకాశం ఇస్తున్నట్లు వివరించారు. అంతరాలయ దర్శనం కోసం ప్రోటోకాల్ అవసరం లేదని స్పష్టం చేశారు. రూ. 500 టిక్కెట్ ధరపై అంతరాలయ దర్శనంతో పాటు రెండు లడ్డూలు, అర్చకుల ఆశీర్వచనం ఉంటాయని అధికారులు వెల్లడించారు.