డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. రాష్ట్రాన్ని వాయుగుండం ముసురు ముసురినప్పటి నుంచి పవన్ కల్యాణ్.. అనారోగ్యంతో బాధపడుతున్నారని, అయినా తన విధుల విషయంలో మాత్రం వెనక్కు తగ్గలేదని సన్నిహితులు చెప్పారు. ఆ జ్వరంతోనే ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న పారిశుధ్య నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీనాభివృద్ధి శాఖల అధికారులతో సమావేశమయ్యారు. వరద ఉధృతి తగ్గిన ప్రాంతాల్లో పారిశుధ్య పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
‘‘వరదల కారణంగా అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం, దోమల బెడద తీవ్రత ఉన్నందున పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి. స్వచ్ఛమైన తాగు నీరు సరఫరా చేయాలి. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకొంటూ నిరంతర పర్యవేక్షణ చేయాలి. ఏలేరు రిజర్వాయర్‌కి వరద ముప్పుపై ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేయండి’’ ఆయన సూచించారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పవన్(Pawan Kalyan) సహా ఆయన కుటుంబ సభ్యులు సైతం వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారని సమాచారం.