EC | ఎన్నికల ముందు వైసీపీకి ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. ఐదుగురు ఎస్పీలు, ఓ ఐజీ, ముగ్గురు కలెక్టర్లపై ఈసీ బదిలీ వేటు వేసింది. ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు జిల్లా ఎస్పీ జాషువా, అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ , నెల్లూరు జాల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి.. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజును బదిలీ చేసింది. అలాగే కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజబాబు, అనంతపురం ఎన్నికల అధికారి గిరీజా, తిరుపతి ఎన్నికల అధికారి లక్ష్మీషాలను కూడా బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ అధికారులు ఎన్నికలు పూర్తయ్యే వరకూ విధుల్లో ఉండకూడదని స్పష్టంచేసింది. బదిలీ అయిన వారి స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ముగ్గురు ఆఫీసర్లతో ప్యానల్ పంపాలని ఆదేశించింది. కాగా వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నాయకుల ఫిర్యాదులతో ఆయా అధికారులపై చర్యలు తీసుకుంటూ ఎన్నికల సంఘం(EC) నిర్ణయం తీసుకుంది.