Election Campaign: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం

-

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. నెల రోజులకు పైగా మార్మోగిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు నేతలు చివరి నిమిషం వరకూ సర్వశక్తులను ఒడ్డారు. రాష్ట్ర స్థాయి నేతలతో పాటు జాతీయ స్థాయి అగ్రనేతలు కూడా క్షేత్రస్థాయిలో దిగి ప్రచారం చేశారు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఇప్పుడు ప్రచారపర్వం ముగిసిపోవటంతో.. ఒక్కసారిగా వాతావరణం ప్రశాంతంగా మారిపోయింది. ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు. అలాగే బల్క్‌ మెసేజ్‌లు, ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌, ఐవీఆర్‌ఎస్‌ సర్వేలు, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రకటనలు, సోషల్‌ మీడియా ప్రకటనలు అన్నీ బంద్ అయ్యాయి.

- Advertisement -

మరోవైపు ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు 144 సెక్షన్ అమలు అవుతుంది. ఇక మద్యం దుకాణాలు కూడా మూతపడ్డాయి. ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్.. తెలంగాణలో 17 పార్లమెంట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికకు మే 13వ తేదీన ఉదయం 7 గంటల ఉంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం సాయంత్ర 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది. ఇక జూన్ 1వ తేదీ వరకు సాయంత్రం 6.30 నిమిషాల వరకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

‘మరోసారి బీసీలను మోసం చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్ర’ 

సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం...

Group 1 Mains: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్...