Annamayya District | గూండాల కోనలో గజేంద్రల బీభత్సం.. ముగ్గురు మృతి

-

Annamayya District | అన్నమయ్య జిల్లాలోని గూండాలకోన దగ్గర గజరాజులు బీభత్సం సృష్టించారు. గూండాల కోన(Gundala Kona) దగ్గరకు వచ్చిన భక్తులపై ఘీంకారాలు చేస్తూ విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు మృతిచెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషయమంగా ఉంది. శివరాత్రిని పురస్కరించుకుని వై.కోటకు చెందిన భక్తులు ఆలయానికి నడుచుకుని వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఏనుగులు ఒక్కసారిగా భక్తులపై దాడి(Elephants Attack) చేశాయి. మృతులను వంకాయల దినేష్, తుపాకుల మణమ్మ, చంగల్ రాయుడుగా గుర్తించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు(Chandrababu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

- Advertisement -

Annamayya District | ఏనుగుల దాడి ఘటనపై డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్‌కల్యాణ్‌(Pawan Kalyan) స్పందించారు. ముగ్గురు చనిపోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ.5లక్షల పరిహారం ప్రకటించారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీధర్‌ను వై.కోటకు వెళ్లాలని పవన్‌ ఆదేశించారు. అసెంబ్లీ నుంచి హుటాహుటిన అక్కడికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించాలన్నారు. దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలని అటవీశాఖ అధికారులను పవన్‌ ఆదేశించారు.

Read Also: రేవంత్.. ఆ ఒక్క అలవాటు మానుకో: ఎర్రబెల్లి
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Akhilesh Yadav | దేశ గౌరవాన్ని విస్మరించేలా సీఎం మాటలు

కుంభమేళా నిర్వహణలో లోపాలున్నాయంటున్న ప్రతిపక్ష నేతలను పందులు, రాబందులతో పోల్చారు ఉత్తర్‌ప్రదేశ్...