Buggana : నేను అప్పుల మంత్రి… యనమల పెద్ద అప్పుల మంత్రా?

-

Finance minister Buggana Rajendranath reddy fires on chandrababu naidu: టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేను అప్పుల మంత్రి అయితే.. యనమల పెద్ద అప్పుల మంత్రా అని నిలదీశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆర్థిక మంత్రి అప్పుల చేయకుండా.. హోంమంత్రి చేస్తారా అని ఎద్దేవా చేశారు. కేవలం ఏపీ మాత్రమే అప్పులు చేస్తుందా అని బుగ్గన ప్రశ్నించారు. కేవలం రాష్ట్రం మాత్రమే కాదు.. దేశం, ప్రపంచం సైతం ఇబ్బందుల్లో ఉన్నాయన్నారు. ఆ ఇబ్బందులను అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. ఆర్థిక మంత్రిగా తాను అప్పులు చేస్తానని.. మరి పాల వ్యాపారం చేసుకుంటున్న చంద్రబాబును పాల నాయుడు అని పిలవాలా అని నిలదీశారు. చంద్రబాబు రౌడీ షీటర్‌లా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

- Advertisement -

తన ఇంటిని, జీవితాన్ని కూలుస్తానని చంద్రబాబు వార్నింగ్‌ ఇస్తున్నారని అన్నారు. సొంత మామ, బావమరిది జీవితాలను చంద్రబాబు కూల్చారంటూ ఆరోపించారు. వందేళ్ల క్రితం తన పూర్వీకులు కట్టిన ఇంట్లోనే తాను ఉంటున్నాననీ.. నారావారి పల్లెలో చంద్రబాబు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఎనిమిది రాష్ట్రాల్లో హైకోర్టులు రాజధానిలో కాకుండా.. ఇతర ప్రాంతాల్లో ఉన్నాయని బుగ్గన (Buggana Rajendranath reddy) గుర్తు చేశారు. రాయలసీమలో హైకోర్టు పెడతామంటే.. వద్దంటున్నారని మండిపడ్డారు. రాయలసీమలో పుట్టిన చంద్రబాబు.. ఇలా అడ్డుకోవటం సిగ్గుచేటు అని అన్నారు. అసలు రాయలసీమకు చంద్రబాబు చేసిన మేలు ఏమిటో చెప్పాలని బుగ్గన ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...