గోదావరిలోకి దిగి ఐదుగురు మృతిచెందిన ఘటన తూర్పు గోదావరి(East Godavari) జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో చోటుచేసుకుంది. మహా శివరాత్రి(Maha Shivaratri) సందర్భంగా ఈరోజు(బుధవారం) ఉదయం స్నానం చేయడానికి 11 మంది యువకులు గోదావరిలోకి దిగారు. నదిలో లోతు ఎక్కువగా ఉన్న విషయాన్నీ యువకులు ఒకరిని కాపాడే ప్రయత్నం మరొకరు చేసి ఐదుగురు గల్లంతయ్యారు. మిగిలిన వారు ఒడ్డుకు చేరుకొని సాయంకోసం కేకలు వేయడంతో స్థానికులు గాలించగా ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది.
East Godavari | అక్కడికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లు సాయంతో మిగతావారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇసుక ర్యాంపులను గుర్తించకపోవడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. మృతులు టి.పవన్ (17), పి. దుర్గాప్రసాద్ (19), పి.సాయి కృష్ణ (19), ఎ. పవన్ (19), జి.ఆకాశ్ (19)గా గుర్తించారు. వీళ్లంతా ఇంటర్మీడియేట్ చుడుతున్నారు. ఒకే గ్రామానికి చెందిన యువకులు కావడంతో తాడిపూడి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.