ఇప్పుడెందుకు వచ్చారు.. బొత్సకు వరద బాధితుల ఝలక్

-

వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించడానికి వచ్చిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana)కు వరద బాధితులు భారీ ఝలక్ ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు వచ్చారంటూ వరద బాధితులు బొత్సను నిలదీశారు. ఇన్ని రోజులు వరద నీటిలో ఇబ్బందులు పడుతుంటే గుర్తుకు రాని తాము మాజీ మంత్రికి ఇప్పుడు ఎలా గుర్తుకొచ్చామంటూ చురకలంటించారు.

- Advertisement -

వరద బాధితుల ఆగ్రహంతో వారిని పరామర్శించడానికి వెళ్లిన బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana)కు ఊహించని షాక్ తగిలింది. వారికిక ఏం సమాధానం చెప్పలేని స్థితిలో నివ్వెరపోయారు మాజీ మంత్రి. అంతేకాకుండా తమకు సహాయం అందకుండా వైసీపీ నేతలే అడ్డుపడుతున్నారంటూ వరద బాధితులు మండిపడ్డారు. వరద బాధితులు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. అధికారంలో లేనోళ్లం ఏం చేస్తామంటూ బొత్స సత్యనారాయణ వెనుతిరిగారు. అయితే వరదలు ముంచెత్తినప్పటి నుంచి వైసీపీ తరపున జగన్, బొత్స మాత్రమే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వారి పర్యటన కూడా తూతూ మంత్రంగానే మారింది.

Read Also: 2,100 మందితో బురద తొలగింపు: చంద్రబాబు
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...