రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదల వల్ల లక్షలాది మంది జీవితాలు అల్లకల్లోలం అయ్యాయని, వారికి అండగా నిలబడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన సహాయం చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆయన పిలుపుమేరకు ఏపీ వరదబాధితులకు విరివిగా విరాళాలు(Flood Donations) రావడం మొదలయ్యాయి. అన్ని రంగాల వారు తమకు తోచినంత సహాయం అందిస్తున్నారు. సినిమా తారలు లక్షలు అందిస్తే, రైతులు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, రైటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు ఇలా ప్రతి ఒక్కరూ కూడా తమ దగ్గర ఉన్నంతలో కొంత వరద బాధితుల కోసం కేటాయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో ఈరోజు పలువురు సీఎం చంద్రబాబును కలిసి విరాళాలు అందించారు.
Flood Donations అందించింది వీరే..
1. ఏజీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ రూ.8.10 కోట్లు(ఒకరోజు మూలవేతనం)
2. ఏ.శివకుమార్ రెడ్డి రూ.1.50 కోట్లు
3. ఈ. చంద్రారెడ్డి రూ.50 లక్షలు
4. విశ్వభారతి ఇనిస్టిట్యూషన్స్ వైస్ వుడ్స్ రూ.30 లక్షలు(గుడివాడ)
5. ఎన్టీఆర్ వెటర్నరీ కాలనీస్ డెవలప్ మెంట్ అసోసియేషన్ రూ. 25 లక్షలు
6. బృందావన్ మీటింగ్ ఏజన్సీస్ రూ.25 లక్షలు
7. శంకర్ రావు రూ.25 లక్షలు
8. మదన్ మోహన్ రావు రూ.25 లక్షలు
9. కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్ రూ.10 లక్షలు
10. అంబికా అగర్ బత్తిస్ ఆరోమా ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అంబికా కృష్ణ రూ.5 లక్షలు
11. అనుమోలు జగన్ మోహన్ రావు రూ. 5 లక్షలు (రైతు)
12. అనుమోలు అనార్కలి రూ. 5 లక్షలు (రైతు)
13. బుద్ధా వెంకన్న రూ.5 లక్షలు
14. రమేష్ హాస్పిటల్స్ రూ.3 లక్షలు
15. అమరావతి కార్ మెకానిక్స్ అసోసియేషన్స్ రూ.2 లక్షలు
16. పి.సుధాకర్ రూ.1,14,000
17. కావూరి దుర్గా మల్లేశ్వర ప్రసాద్ రూ.1,00,116 (రిటైర్డ్ టీచర్)
18. శ్రీ విజయదుర్గ పీఠం రూ.1 లక్ష(అంబేద్కర్ కోనసీమ జిల్లా)
19. మందలపు జయలక్ష్మి రూ.1 లక్ష
20. ఎమ్.గ్రీష్మ రూ.1 లక్ష
21. పీఎస్. కమలాదేవి రూ.1 లక్ష(గృహిణి)
22. హెచ్.ఎం. ప్రమీళా రాణి రూ.1 లక్ష
23. పరుచూరి ప్రమీళా రాణి రూ.1 లక్ష
24. ఎం.వి.జి.కుమార్ రూ.1 లక్ష
25. పీఎస్ఎస్ఎన్పీ శాస్త్రి రూ.51 వేలు
26. ఎం.కృష్ణ రూ.50 వేలు
27. వై. ఉమామహేశ్వరరావు రూ.50,000 (పెన్షనర్)
28. వి.కస్తూరీబాయి రూ.50 వేలు
29. గోవర్థన, గౌతమి, చలపతి రూ.50,000
30. పొలసాని కృష్ణారావు రూ.10,116(పెన్షనర్)