ఎన్‌టీఆర్(NTR) జిల్లా, విజయవాడ(Vijayawada)లో చేపడుతున్న వరద సహాయక చర్యలను వేగవంతం చేసే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే నేవీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. వచ్చీ రాగానే తమ భారీగా సహాయక చర్యలను వేగవంతం చేశాయి. ఇప్పటి వరకు నేవీ హెలికాప్టర్లు.. 2, 97, 500 మందికి ఆహారం, తాగునీరు, ఔషధాలు అందించాయి. మరింత మందికి తమ సేవలు అందించడానికి తమ వంతు కృషి చేస్తున్నాయి. మరికొన్ని హెలికాప్టర్లు కూడా విజయవాడకు చేరుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోసారి వరదల వచ్చేలోపు ప్రతి ఒక్కరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అందుకు అన్ని విధాల సహాయం అందించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
Vijayawada | ఇదిలా ఉంటే హెలికాప్టర్లు ప్రయాణించలేని ఇరుకు ప్రాంతాల్లో సైతం సహాయక చర్యలు అందించడంలో వెనకాడగు పడకూడదని ఏపీ ప్రభుత్వం నిశ్చియించుకుంది. ఇందులో భాగంగానే డ్రోన్లను బరిలోకి దించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఇప్పటికే ట్రయల్ రన్స్‌ను స్టార్ట్ చేసేసింది. మూడు డ్రోన్లతో ఈ ట్రయల్ రన్‌ను నిర్వహించారు అధికారులు. ఈ ట్రయల్ రన్‌లో ఒక్కో డ్రోన్ ఎంత బరువు మోయగలదు? ఎంత దూరం ప్రయాణించగలదు? వంటి అంశాలను పరిశీలించారు. ఈ ట్రయల్ రన్‌ను సీఎం చంద్రబాబు స్వయంగా పర్యవేక్షించారు. ఇందులో ఒక్కో డ్రోన్ 8 నుంచి 10 కిలోల బరువు మోయగలదన్న అంచనాకు వచ్చినట్లు అధికారులు వివరించారు.