ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు(Raghu Rama Krishna Raju) కస్టోడియల్ కేసు కు సంబంధించి విచారణకు అప్పటి సీఐడీ డిఐజి గా పనిచేసిన సునీల్ నాయక్ కు(DIG Sunil Naik) నోటీసులు పంపించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్(SP Damodar) రెండురోజుల క్రితం నోటీసులను వాట్స్ యాప్, ఫ్యాక్స్ ద్వారా నోటీసులు అందజేశారు. సోమవారం ఎస్పీ ఆఫీస్ కు విచారణకు రావాల్సిందిగా అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం సునీల్ నాయక్ బీహార్ లో ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ లో డిఐజి గా విధులు నిర్వర్తిస్తున్నారు.
వైసీపీ(YCP) హయాంలో హైదరాబాద్ లో ఉన్న రఘురామకృష్ణరాజు ను గుంటూరు సీఐడి రీజినల్ ఆఫీస్ కు తరలించారు. ఆ సమయంలో సునీల్ నాయక్ అక్కడికి వచ్చినట్లు దర్యాప్తులో అధికారులు నిర్దారించారు. సిఐడి ఆఫీస్ లో తనపై హత్యాయత్నం జరిగిందని అప్పటి సీఎం వైఎస్ జగన్(YS Jagan) తో పాటు అధికారులపై గుంటూరు నగరంపాలెం పోలీసులకు రఘురామకృష్ణరాజు(Raghu Rama Krishna Raju) పిర్యాదు చేసారు. బీహార్ క్యాడర్ కి చెందిన సునీల్ నాయక్ ను జగన్ ప్రభుత్వం డిప్యూటేషన్ పై తీసుకువచ్చి సిఐడి డిఐజి గా పోస్టింగ్ ఇచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అవ్వగానే తిరిగి బీహార్ వెళ్లిపోయారు.