Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

-

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్ తగిలింది. ఆయన సొంత అల్లుడే రాంబాబును ఛీత్కరించుకుంటూ మాట్లాడిన వీడియో సంచలనం రేపుతోంది. ఈ వీడియోలో అసలు అంబటి రాంబాబు మనిషే కాదని, శవాల మీద పేలాలు ఏరుకునే రకం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

‘‘నాపేరు డాక్టర్ గౌతమ్(Goutham). నేను సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి అయిన అంబటి రాంబాబు(Ambati Rambabu) అల్లుడ్ని. అది నా దురదృష్టకరం. దానికి ఎవరూ ఏం చేయలేదు. ఈ వీడియో చేయాలా వద్దా అని నేను బాగా ఆలోచించి.. చేయడం నా బాధ్యతగా భావించి ఈ వీడియో చేస్తున్నాను. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నా జీవితంలో చూడలేదు. రోజూ దేవుడికి దండం పెట్టుకొనేటప్పుడు ఇంతటి నీచుడ్ని ఇంకోసారి నా జీవితంలో ఇంట్రడ్యూస్ చేయకుస్వామి అని మొక్కుకుంటాను. అంత భయంకరమైన వ్యక్తి అంబటి. ఏ పోస్ట్ కు అయితే.. ఆయన పోటీ చేయబోయే పోస్టుకు మంచితనం, మానవతా విలువలు, కనీస బాధ్యత ఉండాలో.. ఆయనలో అవి లేవు. కనీసం ఇవన్నీ 100 శాతం ఉండక్కర్లేదు. కానీ, వీటిలో 0.001 శాతం లక్షణాలు కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటి వ్యక్తికి మనం ఓటేసేటప్పుడు మనకు తెలియకుండానే మనం కొన్నిటిని ప్రోత్సహిస్తున్నట్లు అవుతుంది.

నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతు వేసుకొని అయినా అబద్ధాన్ని కూడా నిజంగా చేసేయగలమనే కాన్ఫిడెన్స్‌తో బతుకుతారో సమాజంలో.. అలాంటి వాటికి ఓటేస్తున్నట్లు. ఎంత లేకి పని అయినా చేసి సమాజంలో చాలా గౌరవంగా బతకొచ్చు అని అనుకునే వారికి ఓటేస్తున్నట్లు. ఏదైనా చేసి సిగ్గులేకుండా సిగ్గులేని తననాన్ని ప్రోత్సహించవచ్చని అనుకునేవాళ్లకి ఓటేస్తున్నట్లు. ఇలాంటివారికి ఓటు వేస్తే సమాజం కూడా ఇలాగే తయారవుతుంది. దీన్ని ప్రజలు గమనించి మీ సరైన ఓటును బాధ్యతతో సరైన వ్యక్తికి వేసి, మంచి నాయకుడ్ని ఎంచుకుంటారని ఆశిస్తున్నాను’’ అని డాక్టర్ గౌతమ్ ఓ వీడియోను విడుదల చేశారు. దీంతో వైసీపీలో తీవ్ర కలకలం రేగింది.

Read Also: ఏపీ డీజీపీపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...