వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి(Avinash Reddy) సీబీఐ విచారణ మరోసారి వాయిదాపడింది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ ఇంకా జరుగుతూనే ఉంది. దీంతో ఇవాళ సాయంత్రం 4గంటలకు అవినాశ్ ని సీబీఐ విచారించాల్సి ఉండగా.. విచారణను రేపు నిర్వహిస్తామని కోర్టుకు తెలిపింది. రేపు ఉదయం 10.30గంటలకు సీబీఐ కార్యాలయానికి రావాలని తెలియజేస్తామని పేర్కొంది. మరోవైపు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై హోరాహోరిగా వాదలను జరుగుతున్నాయి. కోర్టు హాల్లో సునీతారెడ్డి లాయర్, అవినాశ్ రెడ్డి లాయర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో హైకోర్టు తీర్పుపై వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
- Advertisement -
Read Also: ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు సిక్సర్లు నమోదు
Follow us on: Google News, Koo, Twitter