Janasena | జనసేన పార్టీకి హైకోర్టులో భారీ ఊరట

-

ఎన్నికల ముందు జనసేన(Janasena) పార్టీకి భారీ ఊరట లభించింది. ఆ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తు కేటాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ ఏపీ హైకోర్టు(Ap Highcourt) కొట్టేసింది. కోర్టు తీర్పుతో ఈ ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుపైనే జనసేన అభ్యర్థులు పోటీ చేయనున్నారు. దీంతో న్యాయస్థానం తీర్పుపై జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

కాగా జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించడంపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్(సెక్యులర్) పార్టీ అభ్యంతరం తెలిపింది. జనసేనకు కేటాయించిన గాజు గ్లాస్ గుర్తును రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసింది. ఫ్రీ సింబల్‌గా ఉన్న గాజు గ్లాసు గుర్తు కోసం తొలుత తాము దరఖాస్తు చేశామని.. అయితే ఎన్నికల సంఘం గుర్తును జనసేనకు కేటాయించిందని ఆ పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఆ పిటిషన్ కొట్టేస్తూ జనసేన(Janasena)కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

Read Also: అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Janasena | జనసేనకు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై ఈసీ కీలక ఆదేశాలు..

ఎన్నికల వేళ జనసేన(Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త అందించింది....

Nomination Withdrawal | తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

Nomination Withdrawal | తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిది....