పుష్ప-2 ప్రీమియర్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో సంధ్యా థియేటర్‌లలో జరిగిన తొక్కిసలాట వివాదం రోజురోజుకు తీవ్రతరం అవుతోంది. అల్లు అర్జున్(Allu Arjun)పై వ్యతిరేకక పెరుగుతోంది. అల్లు అర్జున్ కావాలనే అనుమతులు లేకుపోయినా అక్కడకు వచ్చారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఆదివారం అల్లు అర్జున్ నివాసం దగ్గర విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టాయి. రేవతి మరణానికి, ఒక బాలుడు అపస్మారక స్థితిలో చావుతో పోరాడటానికి అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యమే కారణమంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే కొందరరు అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి చేశారు. ఆయన ఇంట్లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించారు.
రాళ్లు తగిలి అల్లు అర్జున్(Allu Arjun) ఇంట్లో పలు పూలకుండీలు పగలగా.. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో అల్లు అర్జున్ నివాసాన్ని భారీగా పోలీసులు మోహరించారు. విద్యార్థి సంఘాల వారిని, రాళ్లు విసిరిన వారిని పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో అల్లు అర్జున్ ఇంట్లో లేరు. దీంతో ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి అక్కడకు చేరుకుని అసలేం జరిగింది అన్న విషయంపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసే అవకాశం ఉందన్నటలు తెలుస్తోంది.