Honor killing in Tirupati :తిరుపతి జిల్లాలో పరువు హత్య కలకలం

-

Honor killing in Tirupati Reddyvaripalli of Chandragiri Mandal has created daughter over love affair: ఏపీ రాష్ట్రంలో మరో పరువు హత్య తీవ్ర కలకలం రేపింది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రెడ్డివారిపల్లిలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థిని మోహనకృష్ణ(19) అనే యువతి ఆంజనేయపురానికి చెందిన వికాస్‌ అనే యువకున్ని ప్రేమించింది. దీంతో వేరే కులం యువకుడిని ప్రేమించడాని జీర్ణించుకోలేకపోయిన తండ్రి కూతురిని హత్య చేశాడు. ఆపై ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు ఆత్మహత్య, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొన్నారు. అయితే.. పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం గొంతు నులిమి చంపినట్లు వెల్లడైంది. దీంతో కుటుంబసభ్యులే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నాట్లు సమాచారం. కాగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...