RGV | ‘కేసులకు నేనేమీ భయపడట్లేదు’

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(RGV) పరారీలో ఉన్నాడని, ఆయన కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు గాలింపులు చేపట్టారంటూ రెండు రోజులు వార్తలు మోత మోగిపోయాయి. అంతేకాకుండా ఆర్‌జీవీ కూడా సోషల్ మీడియా సహా ఎక్కడా కూడా యాక్టివ్‌గా లేకపోవడంతో ఈ వార్తలు నిజమేనని చాలా మంది నమ్మారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వార్తలకు చెక్ పెట్టారు రామ్ గోపాల్ వర్మ్ అలియాస్ ఆర్‌జీవీ. తాను ఏమీ పారిపోలేదంటూ ఓ వీడియోను విడుదల చేశారు. తన గురించి చాలా మంది ఇష్టారాజ్యంగా ప్రచారాలు చేస్తున్నారని, వారందరికీ క్లారిటీ ఇవ్వడం కోసమే తాను ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నానని అన్నారు.

- Advertisement -

‘‘నేను కేసులకు భయపట్లేదు. నేను పోస్టులు పెట్టిన వారికి కాకుండా సంబంధం లేని వ్యక్తుల మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయి. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్‌లో ఉన్నాను. నిర్మాతకు నష్టం వస్తుందన్న కారణంగానే పోలీసుల విచారణకు రాలేకపోతున్నాను’’ అని ఆయన(RGV) తన వీడియోలో వివరించారు.

Read Also:  పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. మండిపడ్డ హైకోర్టు
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...