IMD | భారీ వదరలతో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అతలాకుతలం అవుతోంది. ఈ వరదలతోనే ప్రజలు అల్లాడుతుంటే ఇంతలో కేంద్ర వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ వరదల కష్టాలు ఇంకా రానున్నట్లు ఐఎండీ హెచ్చరించింది. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీన పడిన విషయం వాస్తవమేనని కానీ అతి త్వరలో బంగాళాఖాతంలో మరో వాయుంగుం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం వల్ల కూడా కోస్తాంధ్ర సహా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలు భారీ వర్షాలు చూడొచ్చని తెలిపింది. వీటి వల్ల ఇప్పటికే పొంగిపొర్లుతున్న వాగుల ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని, కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఐఎండీ హెచ్చరికతో ఆంధ్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ఉన్న వరద స్థితితో తలమున్కలవుతున్న ఏపీ ప్రభుత్వ అధికారులు, క్యాడర్‌కు ఇప్పుడు ఐఎండీ హెచ్చరిక మరింత తలనొప్పిని తెచ్చిపెట్టింది.
‘‘సెప్టెంబర్ 5-6వ తేదీని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ మేరకు సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ అల్పపీడనం.. కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకోని ఏర్పడనుంది. దీని వల్ల ఏపీ అంతటా భారీ వర్షాలు కురిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాజస్థాన్‌లోని జైసల్మేర్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా మచిలీపట్నం వరకు ఋతుపవన ద్రోణి ఆవరించి ఉండనుందని అంచనా. ఇప్పటికే పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరెన్నో ప్రాంతాలు జలమయ్యాయి’’ అని ఐఎండీ(IMD) వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత చర్యలను చేపట్టాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు తీసుకోవాలని ఐఎండీ సూచిస్తోంది. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని, వర్ష సమయాల్లో అత్యవసరం కాకుండా బయటకు రావొద్దని హెచ్చరిస్తోంది.