జీవో నెం.1 పై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం హోంశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. జీవో నెం 1ను సమర్ధవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. రోడ్లపై సభలతో ప్రాణనష్టం జరిగే పరిస్ధితులు రాకూడదన్నారు. తమ రోడ్ షోలకు ప్రజలు ఎక్కువగా వచ్చారని చూపేందుకు రోడ్లు కిక్కిరిసేలా చేస్తున్నారని.. తక్కువ మంది వచ్చినా ఎక్కువగా చూపే ప్రయత్నం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ఇటీవల చోటు చేసుకున్న ఆయా ఘటనల్లో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని సీఎం విచారం వ్యక్తం చేశారు. ఇటీవల సచివాలయాల్లో వున్న మహిళా పోలీసులకు ఖచ్చితమైన ప్రోటోకాల్ వుండాలన్నారు. వారి బాధ్యతలు, విధుల విషయంలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై ఆలోచించాలన్నారు. అలాగే ‘దిశ’ యాప్‌పై(Disha App) మరోసారి డ్రైవ్ నిర్వహించాలని జగన్(CM Jagan) ఆదేశించారు. ప్రతి ఇంట్లో యాప్ డౌన్‌లోడ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
Read Also: ఆంధ్రప్రదేశ్‌లో 175 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ
Follow us on: Google News, Koo, Twitter