నిరుద్యోగులకు గుడ్ న్యూస్… ఏపీలో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఆదేశాలు

-

ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్ 1 లో 89 పోస్టులు, గ్రూప్ 2లో 508 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మొత్తం 597 పోస్టులు భర్తీ కానున్నాయి.

- Advertisement -

గ్రూప్ 1 కేటగరీలో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ కేటగరీ-2, అసిస్టెంట్ కమీషనర్ ( ఎస్టీ), అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టుల, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్ 2), జిల్లా రిజిస్ట్రార్లు, సేల్స్ ట్యాక్స్‌లో అసిస్టెంట్ కమిషనర్లు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారులు, ప్రాంతీయ రవాణా అధికారుల ఉద్యోగాలున్నాయి.

ఇక గ్రూప్-2లో సచివాలయంలోని సాధారణ పరిపాలనలో 161 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, ఫైనాన్స్‌లో 23 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, 12 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు లా, 10 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు లెజిస్లేచర్, నలుగురు గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్లు, 114 డిప్యూటీ తహశీల్దార్లు. , 16 సబ్-రిజిస్ట్రార్లు (గ్రేడ్ 2), 150 ఎక్సైజ్ సబ్-ఇన్‌స్పెక్టర్లు మరియు 18 అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ల పోస్టులు భర్తీ కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...