జనసేన అధినేత పవన్‌కళ్యాణ్(Pawan Kalyan)కు అభిమానులు కంటే భక్తులు ఉంటారని చెప్పడంలో అతిశయోక్తి కాదు. హీరోగా కంటే రాజకీయ నాయకుడిగానే ఆయనను ఎక్కువ మంది ఆరాధిస్తూ ఉంటారు. ముఖ్యమంత్రిగా చూడాలని.. అసెంబ్లీలో అడుగుపెట్టాలని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 17 ఏళ్లుగా ఐర్లాండ్ దేశంలో ఉండే ఓ అభిమాని రాసిన లేఖకు పవన్ కల్యాణ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తనను తాను ‘ఓడ కళాసీ’గా పరిచయం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లేఖ సారాంశం ఇదీ.
అన్నా..
కష్టాలు, కన్నీళ్లు, రుణాలు దారుణాలు… కారణాలుగా చూపిస్తూ.. నా దేశాన్ని వదిలి విదేశాల్లో అవమానాల్లో ఆనందాలను వెతుక్కునే నాలాంటి వాళ్లెందరికో.. ఒక్కటే నీమీద ఆశ! ఎక్కడో బలీవియా అడవుల్లో అంతమై పోయిందని అనుకున్న విప్లవానికి కొత్త రూపాన్ని ఒకటి కనిపెట్టకపోతావా?
సరికొత్త గెరిల్లా వార్ ఫైర్‌ని మొదలెట్టకపోతావా? మన దేశాన్ని.. కనీసం మన రాష్ట్రాన్నయినా.. మార్చక పోతావా?
17 ఏళ్లుగా ఈ దేశంలో లేకపోయినా.. ఈ దేశంపై ప్రేమతో భారత పౌరసత్వాన్ని వదులుకోలేక.. ఎదురు చూస్తున్న నాలాంటివాళ్లందరం.. మా కోసం నిలబడుతున్న నీకోసం బలపడతాం.
2014 – నిలబడ్డాం
2019 – బలపడ్డాం
2024 -బలంగా కలబడదాం!
కారుమీద ఎక్కేటప్పుడు జాగ్రత్త అన్నా.. కారు కూతలు కూసేవారిని పట్టించుకోకన్నా.. కారుమబ్బులు కమ్ముతున్నా… కార్యోన్ముఖుడివై వెళ్తున్న నీకు ఆ మహాశక్తి అండగా ఉంటుందన్నా.. పవర్ స్టార్‌వి నువ్వే కదన్నా!! నువ్వు రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపించే నాయకుడివి. – ఐర్లాండ్ నుంచి ఒక ఓడ కళాసి.
ఈ లేఖపై పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పందిస్తూ ట్వీట్ చేశారు. “ఐర్లాండ్ దేశంలో ఓడ కళాసీగా పని చేస్తున్న నా జనసేన అభిమాని నీ ఉత్తరం అందింది. చదివిన వెంటనే గొంతు దుఃఖంతో పూడిపోయింది. కన్నీరు తెప్పించావు.. కార్యోన్ముఖుడిని చేశావు” అని ట్విట్టర్‌లో తెలిపారు.
ఐర్లాండ్ దేశం లో ‘ఓడ కళాసీకి’ గా పనిచేస్తున్నా నా ప్రియమైన జనసైనికుడికి, నీ ఉత్తరం అందింది, చదివిన వెంటనే,
గొంతు దుఃఖంతో పూడుకుపోయింది.. కన్నీరు తెప్పించావు..
కార్యోన్ముఖుడిని చేసావు.. 🙏 pic.twitter.com/XhbSYQ1Y6D— Pawan Kalyan (@PawanKalyan) January 17, 2024