వచ్చే ఎన్నికల్లో పొత్తుపై పవన్ కల్యాన్ కీలక వ్యాఖ్యలు

-

మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో బీసీ నేతలతో నిర్వహించిన సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను ఒక కులానికి పరిమితం చేయొద్దని అన్నారు. అన్ని కులాలు, అన్ని మతాలు అభివృద్ధి చెందాలన్నదే తన కోరిక అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాపు-బీసీ కాంబినేషన్ ఉండాలని ఆకాంక్షించారు. కాపు-బీసీ కలిస్తే రాజ్యాధికారం సాధ్యం అని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. తనకు క్యాస్ట్ ఫీలింగ్ లేదని, ఆ ఫీలింగ్‌తోనూ పెరగలేదని అన్నారు. మానవత్వంతో పెరిగానని తెలిపారు. కాపు రిజర్వేషన్లపై కొందరు బీసీ నేతలు తమ అభిప్రాయాన్ని చెప్పారు. రేపు కాపు ప్రతినిధులతో జరిపే సమావేశంలో చర్చిస్తానని హామీ ఇచ్చారు. బీసీలంటేనే ఉత్పత్తి కులాలు. ఉత్పత్తి లేకుంటే సమాజమే లేదు. బీసీలంటే బ్యాక్ వార్డ్ క్లాస్ కాదు. బ్యాక్ బోన్ క్లాస్. బీసీలకు ఇన్ని ఇచ్చాం.. ఇన్ని పదవులిచ్చాం అని పార్టీలు చెప్పుకుంటున్నాయి. బీసీ కులాలకు సంఖ్యా బలం ఉన్నా దేహీ అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? బీసీల అనైక్యతే మిగిలిన వారికి బలం. బీసీలు ముందుగా సాధించాల్సింది ఐక్యత అని పవన్ (Pawan Kalyan) సూచించారు.

- Advertisement -
Read Also: జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే!

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...