18నెలలైనా సీఎం జగన్ ఏం చర్యలు తీసుకున్నారో ఆ దేవుడికే ఎరుక: పవన్

-

వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) మరోసారి వరుస ట్వీట్లతో విమర్శల వర్షం కురిపించారు. 2021లో సంభవించిన వరదల వల్ల కొట్టుకుపోయిన అన్నమయ్య డ్యామ్(Annamayya Dam) పునర్ నిర్మాణంతో పాటు బాధితులకు 18 నెలలు గడిచినా ఏ ఒక్క పని కూడా చేయలేదని ఎద్దేవా చేశారు. ఇటీవల సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ పాపం పసివాడు అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన పవన్.. ఇప్పుడు అన్నమయ్య డ్యామ్ పునర్ నిర్మాణంలో ప్రభుత్వం వైఫల్యంపై ప్రశ్నించారు.

- Advertisement -

‘19.11.2021 తేదీన తెల్లవారుజామున కురిసిన అతి భారీ వర్షాలకు డ్యాం యొక్క మట్టికట్ట తెగిపోయింది. హఠాత్తుగా సంభవించిన ఈ వరద కారణంగా నది ఒడ్డున ఉన్న మందపల్లి, తొగురుపేట, పులపటూరు, గుండ్లూరు గ్రామాలలోని 33 మంది ప్రజలు జలసమాధి అయ్యారు. ప్రమాద ఘటన వెంటనే చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక హైలెవెల్ కమిటీ వేస్తున్నాము, ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం అసెంబ్లీలో ఘనంగా ప్రకటించారు. మరి ఆ కమిటీ ఏమైందో వారు రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏ సూచనలు చెప్పారో, ఏపీ సీఎం ఏం చర్యలు తీసుకున్నారో ఆ దేవుడికే ఎరుక’ అంటూ పవన్ ట్వీట్ చేశారు.

‘ఈ దుర్ఘటన జరిగి ఈ రోజుతో 18 నెలలు. ప్రాజెక్టు పూర్తి దేవుడికి ఎరుక కనీసం ఈరోజుకి కూడా వీసమెత్తు పనులు చేయలేదు. ఈ 18 నెలలలో చేసింది ఏమిటయ్యా అంటే అస్మదీయుడు పొంగులేటికి 3.94 శాతం అదనపు ప్రయోజనంతో రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి పనిని 660 కోట్లకు అప్పచెప్పారు’ అని పవన్(Pawan Kalyan) ఆరోపించారు. అప్పట్లో ‘కేంద్ర జలవనరుల శాఖ మంత్రి శకావత్ రాజ్యసభలో ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని స్పష్టంగా చెప్పారని, అంతర్జాతీయంగా ఈ ఘటనపై గనక అధ్యయనం జరిగితే మన దేశ ప్రతిష్టకు భంగం కలుగుతుందని వాపోయారు’ అని పవన్ తెలిపారు.

Read Also: ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు పవన్ కల్యాణ్, తారక్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Prasanna Vadanam | ‘ప్రసన్న వదనం’ ట్రైలర్ విడుదల.. సస్పెన్స్ అదిరిపోయిందిగా..

యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే...

Malla Reddy | మల్కాజిగిరిలో నువ్వే గెలుస్తున్నావ్.. ఈటలతో మల్లారెడ్డి

తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Malla Reddy)...