ఏపీ మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలంటూ పవన్ వార్నింగ్

-

తెలంగాణ ప్రజలను ఉద్దేశిస్తూ ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌(Pawan Kalyan) తీవ్రంగా ఖండించారు. ఒక జాతిని ఉద్దేశించి నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని.. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని పవన్ హెచ్చరించారు. మీరు విమర్శించాలనుకుంటే.. ఆ వ్యక్తిని విమర్శించాలే కానీ.. ప్రజలను విమర్శించడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజలను అవమానించేలా మంత్రులు మాట్లాడుతుంటే వైసీపీ సీనియర్ నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

- Advertisement -

తెలంగాణ మంత్రి హరీశ్ రావు(Harish Rao) ఏ సందర్భంలో అలాంటి వ్యాఖ్యలు చేశారో తెలియదని.. కానీ అందుకు ఏపీ మంత్రులు స్పందించిన తీరు సమంజసం కాదన్నారు. తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని పవన్(Pawan Kalyan) డిమాండ్ చేశారు. సీఎం జగన్(Jagan) తో సహా ఎవరైనా సరే జాతిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా ఇటీవల ఓ కార్యక్రమంలో హరీశ్ రావు ఏపీలో పాలనపై వ్యాఖ్యలు చేయగా.. అందుకు కౌంటర్ గా ఏపీ మంత్రులు తెలంగాణ ప్రాంతంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

Read Also: వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు.. కాసేపట్లో అవినాశ్ రెడ్డి విచారణ

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Banana | రోజుకో అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా..!

అరటి పండు(Banana) తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జగమెరిగిన...

Salman Khan | ‘నేను అదో గొప్ప అనుకునేవాడిని’.. యాటిట్యూడ్‌పై సల్మాన్ క్లాస్

బిగ్‌బాస్ 18వ సీజన్‌ను హోస్ట్ చేస్తున్న సల్మాన్ ఖాన్(Salman Khan).. తాజా...