తెలంగాణలో పోటీ చేసిన జనసేన(Janasena)కు ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదన్న సీఎం జగన్(CM Jagan) విమర్శలపై జనసేన తీవ్రంగా స్పందించింది. “సెల్ఫ్ గోల్ వేసుకోడంలో నిన్ను మించినోడు లేడు కదా సీబీఐ దత్తపుత్రా జగన్. 2014 తెలంగాణ ఎన్నికల్లో నీ పార్టీకి వచ్చిన ఓట్లు, తెలంగాణ ప్రజలు నిన్ను రాళ్లతో కొట్టిన తీరు మర్చిపోయావా? ఇండిపెండెంట్‌గా నిలబడి పోటీ చేసే దమ్ము బర్రెలక్కకైనా ఉంది కానీ, తెలంగాణలో పోటీ చేసే దమ్ము నీకు నీ పార్టీకి లేదు అని నువ్వే చెప్పుకుంటున్నట్టుంది” అని కౌంటర్ ఎటాక్ చేస్తూ ట్వీట్ చేసింది.
“కొల్లాపూర్ లో సామాన్యురాలు బర్రెలక్క స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఓట్లు – 5754 (2.99%).. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా చేసిన వ్యక్తి చనిపోయిన సింపతీపై నిర్మించబడిన వైసీపీ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్ధికి వచ్చిన ఓట్లు- 1240 (0.81%). పక్క రాష్ట్రంలో పక్క పార్టీకి వచ్చిన ఫలితాలపై కాకుండా ఉన్న 90 రోజులైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనికొచ్చే పనులకి సమయాన్ని వెచ్చించండి” అని జగన్‌కు సూచించింది.