Pawan Kalyan | సీఎం జగన్‌పై దాడి ఘటనకు ఆ నలుగురిని విచారించాలి: పవన్ కల్యాణ్

-

ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి(YS Jagan)పై జరిగిన రాయి దాడి ఘటనకు డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషన్, సీఎం భద్రతాధికారుల వైఫల్యమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌(Pawan Kalyan) తెలిపారు. ముందుగా ఈ నలుగురిని విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద గులకరాయితో దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? వివిఐపి కేటగిరీలో ఉన్నారనే కదా సదరు పాలకుడు ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళినా పరదాలు కట్టి… చెట్లు కొట్టేసేవారు. అన్నీ పట్టపగలే నిర్వహించారు కదా. మరి ఏ ఉద్దేశంతో విజయవాడ నగరంలో విద్యుత్ కూడా నిలిపివేసి చీకట్లో యాత్ర చేయించారు? పరదాలూ కట్టలేదు… చెట్లూ కొట్టలేదు.

ఈ దాడి విషయంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి బాస్ అయిన డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారుల పాత్ర గురించీ విచారణ చేయించాలి. వాళ్ళు తీసుకున్న భద్రత చర్యల్లో లోపాలు ఏమిటి? ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏమిటనేది తేలాలి. ముందుగా సదరు అధికారులను బదిలీ చేసి, సచ్ఛీలత కలిగిన అధికారులకు విచారణ బాధ్యత అప్పగిస్తేనే గులకరాయి విసిరిన చేయి… ఆ చేయి వెనక ఉన్నదెవరో బయటపడుతుంది. సూత్రధారులు, పాత్రధారులెవరో తేలుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పర్యటించి ఎన్నికల సభలో పాల్గొన్నప్పుడే సెక్యూరిటీ పరమైన లోపాలు వెల్లడయ్యాయి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను. ఇలాంటి అధికారులు ఉంటే గౌరవ ప్రధానమంత్రి గారు మరోసారి పర్యటించినప్పుడూ ఇంతే నిర్లక్ష్యం ప్రదర్శిస్తారు. వీళ్లతో ఎన్నికలు ఎలా పారదర్శకంగా నిర్వహించగలరు? ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దృష్టిపెట్టాలి’’ అని పవన్ కల్యాణ్(Pawan Kalyan) డిమాండ్ చేశారు. కాగా రాయి దాడి ఘటనపై దర్యాప్తునకు 20 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు.

Read Also: లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు ఒకేరోజు రెండు ఎదురుదెబ్బలు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Janasena | జనసేనకు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై ఈసీ కీలక ఆదేశాలు..

ఎన్నికల వేళ జనసేన(Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త అందించింది....

Nomination Withdrawal | తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

Nomination Withdrawal | తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిది....