అనంతపురం జిల్లా తాడిపత్రి(Tadipatri)లో హైటెన్షన్ నెలకొంది. పెద్దపప్పూరు మండలం పెన్నానదిలో ఇసుక అక్రమ తరలింపు పరశీలనకు టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) వెళ్తుండగా.. పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మీడియాను సైతం ఆయన ఇంటి వద్దకు రాకుండా బ్యారికేడ్లు ఏర్పాటుచేశారు. ముందస్తుగా టీడీపీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకున్న ఆయన రోడ్డుపై అడ్డంగా పడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, జేసీ అనుచరుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అయినా సరే పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా స్టేషన్ కు తరలించారు.
- Advertisement -
Read Also: పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం
Follow us on: Google News, Koo, Twitter