JC Prabhakar Reddy: జేసీ కంపెనీ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ

-

JC Prabhakar Reddy Company Assets ED Attached: దేశ వ్యాప్తంగా ఈడీ దాడులు జోరు పెంచింది. తాజాగా, టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి కంపెనీకి చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అటాచ్‌ చేసింది. జేసీ ప్రభాకర్‌కు చెందిన దివాకర్‌ రోడ్‌లైన్స్‌, ఝటధార ఇండస్ట్రీస్‌, సి.గోపాల్‌ రెడ్డి అండ్‌కోకు సంబంధించిన కంపెనీ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్లలో అవతవకలు జరిగినట్లు ఈడీ పేర్కొంది. సుప్రీం కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఈడీ వెల్లడించింది. అశోక్‌ లేలాండ్‌ నుంచి తక్కువ ధరకు వాహనాలు కొనుగోలు చేసినట్లు అధికారులు వివరించారు. ఏపీ, కర్ణాటక, నాగాలాండ్‌లో నకిలీ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేసినట్లు తెలిపారు. వీటిల్లో అశోక్‌ లేలాండ్‌ పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...