Jonnavithula | ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ.. పేరు ఇదే!

-

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగు భాషా పరిరక్షణ కోసం ‘జై తెలుగు’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు కాబోతుంది. సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు(Jonnavithula Ramalingeswara Rao) ఈ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. రాజకీయ నాయకులకు, ప్రజలకు సరైన అవగాహన కల్పించడమే తమ పార్టీ లక్ష్యమని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని ప్రజలను చైతన్యవంతులను చేయడానికే పార్టీని పెడుతున్నట్లు వెల్లడించారు. విజయవాడలో మంగళవారం ప్రెస్ మీట్ పెట్టి ఈ కొత్త పార్టీ అంశాన్ని ప్రకటించారు. తెలుగు భాషకు పునర్‌ వైభవం తీసుకురావాలన్నదే తన సంకల్పమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు భాష, పరిరక్షణ అజెండాతో రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్ట్ 15 నాటికి తమ పార్టీ విధివిధానాలు ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ తీవ్రంగా నష్టపోయిందని జొన్నవిత్తుల(Jonnavithula) అన్నారు.

- Advertisement -
Read Also:
1. గద్దర్ సంచలన నిర్ణయం.. ఢిల్లీలో కొత్త పార్టీ రిజిస్ట్రేషన్!
2. ‘పేదలను హింసించి జగన్‌ పైశాచిక ఆనందం పొందుతున్నారు’

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...