ప్రస్తుతం ఏపీలో మెగా ఫ్యామిలీ వర్సెస్ వైసీపీ మినిస్టర్స్ అన్నట్లుగా రాజకీయం సాగుతోంది. బ్రో సినిమాలో మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) పాత్ర క్రియేట్ చేసి హేళన చేశారని మంత్రి ఆరోపించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. సినిమా కలెక్షన్లలో అక్రమాలు జరిగాయని దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయడానికి మంత్రి అంబటి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మంత్రి అంబటికి మెగాస్టార్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలోని అసలు సమస్యలు వదిలేసి ఇండస్ట్రీమీద పడతారేంటి అని ప్రశ్నించారు. ఇక తాజాగా.. ఈ వ్యవహారంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) స్పందించాడు. చిరంజీవి జనసేన పార్టీలో చేరతారని తాను ముందే చెప్పానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చిరంజీవి(Chiranjeevi), పవన్ కళ్యాణ్(Pawan Kalyan)లు ప్రజలను మోసం చేస్తున్నారని.. ఇన్‌కం ట్యాక్స్ ఎగ్గొట్టడానికే బీజేపీతో జనసేన పార్టీ(Janasena) పొత్తు అని కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ-బీ పార్టీలను ఓడిస్తానని.. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను ప్రజలను నమ్మొద్దన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ది వారాహి యాత్ర కాదని.. మోడీ యాత్ర అని కేఏ పాల్(KA Paul) విమర్శించారు. చిరంజీవి కూడా జనసేనలో చేరుతారని లీక్స్ ఇస్తున్నారని అన్నారు. 2024 తర్వాత జనసేన బీజేపీలో విలీనం కావడం ఖాయమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ జోస్యం చెప్పారు.